1097 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-21T03:15:14+05:30 IST

మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇస్కపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి పాండురంగనాథ్‌ ఆధ్వర్యంలో ఆదివారం 1097 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు.

1097 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌
ఉదయగిరిరూరల్‌ : వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న మండల అధికారులు

అల్లూరు, జూన్‌ 20: మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇస్కపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి పాండురంగనాథ్‌ ఆధ్వర్యంలో ఆదివారం 1097 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దారు శ్రీరామకృష్ణ, ఎంపీడీవో నగేష్‌కుమారి, వైద్యాధికారి పాండురంగనాథ్‌ పర్యవేక్షించారు. 

1002 మందికి టీకా

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 20: మండలంలో ఆదివారం ప్రత్యేక కొవిడ్‌ టీకా ఉత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా అన్ని సచివాలయాల పరిధిలో వైద్యఆరోగ్య సిబ్బంది 1002 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌.శ్రీకళ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేకాఽధికారి శ్రీనివాసులు, ఎంపీడీవో వీరాస్వామి, వైద్యాధికారి శ్రీకళ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆరోగ్య బోధకుడుు వెంకటసుబ్బయ్య, హెచ్‌ఈవో చల్లా శ్రీనివాసులు, ఆరోగ్య పర్యవేక్షకుడు అక్బర్‌బాషా, సర్పంచు కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కరిముల్లా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-21T03:15:14+05:30 IST