
హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 124.96 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 80.35లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 98.35 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,765 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 99,763 కాగా గడచిన 18 రోజుల్లో పాజిటివ్ రేట్ 1శాతం(0.85శాతం) ఉన్నట్టు అధికారులు తెలిపారు.