దేశంలో 134.61 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-15T21:01:52+05:30 IST

దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ముమ్మరం చేసింది

దేశంలో 134.61 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ముమ్మరం చేసింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 134.61 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 68లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో 2020, మార్చితో పోలిస్తే రికవరీ రేటు 98.38శాతం ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,984 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 87,562గా నమోదైంది. గడిచిన 31 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్1శాతం(0.67శాతం)గా వుంది. 

Updated Date - 2021-12-15T21:01:52+05:30 IST