దేశంలో 167.29 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-02-02T21:11:26+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది.

దేశంలో 167.29 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో 167.29 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన 24గంటల్లో 57లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 94.91 శాతంగంగా అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లలో కొత్తగా 1,61,386 కేసులు నమోదయ్యాయి. కాగా యాక్టివ్ కేసులసంఖ్య 16,21,603గా అధికారులు తెలిపారు. వీక్లీ పాజిటివిటీ శాతం 14.15గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-02-02T21:11:26+05:30 IST