
హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. ఇప్పటి వరకూ 175.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 36.20 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.21 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,270 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,53,739 కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 2.50శాతంగా అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి