ముషీరాబాద్‌లో టీకా కోసం తోపులాట

ABN , First Publish Date - 2021-05-08T18:11:59+05:30 IST

ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో టీకాల కోసం రెండురోజుల క్రితం బుక్‌ చేసుకున్నవారికి

ముషీరాబాద్‌లో టీకా కోసం తోపులాట

  • ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నా.. 
  • టోకెన్లు అందినవారికే వ్యాక్సిన్‌

హైదరాబాద్/ముషీరాబాద్‌ : జిల్లా వైద్య శాఖ అధికారుల ఆకస్మిక ఆదేశాలతో టీకాలు వేయడంలో గందరగోళం ఏర్పడింది. ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో టీకాల కోసం రెండురోజుల క్రితం బుక్‌ చేసుకున్నవారికి వ్యాక్సిన్‌ వేయవద్దని, కేవలం శుక్రవారం బుక్‌ చేసుకున్న, అందులోనూ టోకెన్లు ఇచ్చినవారికే వ్యాక్సిన్‌ వేయాలని అధికారులు ఆదేశించారు. అప్పటికే సిబ్బంది ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి టోకెన్లు ఇచ్చారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు, నిన్న, మొన్న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారు ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. వైద్య సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు. వెంటనే డాక్టర్‌ కృష్ణమోహన్‌ ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆందోళన చేస్తున్న వారికి సర్దిచెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వ్యాక్సిన్‌ వేస్తున్నామని డాక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపారు. శుక్రవారం 161 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.

Updated Date - 2021-05-08T18:11:59+05:30 IST