కొవిడ్‌ టీకా సురక్షితం: డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-01-24T05:57:33+05:30 IST

చిత్తూరు జిల్లాలో 51 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు

కొవిడ్‌ టీకా సురక్షితం: డీఎంహెచ్‌వో
డీఎంహెచ్‌వోకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ

చిత్తూరు రూరల్‌, జనవరి 23: జిల్లావ్యాప్తంగా శనివారం 1203 మంది కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. మొత్తం 88 కేంద్రాల్లో 3726 మందికి టీకా పంపిణీ చేయాలని వైద్యశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయితే 1203 మంది మాత్రమే వ్యాక్సినేషన్‌కు ముందుకొచ్చారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 51 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు. కాగా, శనివారం ఆయన చిత్తూరు జిల్లా వైద్యశాలలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ టీకా అత్యంత సురక్షితమనీ, వ్యాక్సిన్‌ వేయించుకున్న ఏ ఒక్కరికీ అనారోగ్య సమస్యలు తలెత్తలేదని డీఎంహెచ్‌వో గుర్తుచేశారు. మొదటి విడతలో వ్యాక్సిన్‌ వేయించుకోని హెల్త్‌వర్కర్లు రెండవ విడతలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఐవో హనుమంతరావు, ఎస్వో రమే్‌షరెడ్డి, డెమో నిర్మలమ్మ, ఎపిడమాలజిస్ట్‌ శ్రీవాణి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అరుణ్‌కుమార్‌, కొవిడ్‌ నోడల్‌ ఆఫీసర్‌ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T05:57:33+05:30 IST