భారత్‌.. ప్రపంచాన్నే కాపాడింది

ABN , First Publish Date - 2021-03-08T13:15:41+05:30 IST

ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందని అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీటర్‌ హాట్జ్‌ అన్నారు. భా

భారత్‌.. ప్రపంచాన్నే కాపాడింది

అమెరికా శాస్త్రవేత్త పీటర్‌ హాట్జ్‌ 

వాషింగ్టన్: ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయడం ద్వారా భారత్‌ కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడిందని అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పీటర్‌ హాట్జ్‌ అన్నారు. భారత్‌ భాగస్వామ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పారు. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలో భారత్‌ ఔషధ రంగంలో తనకున్న అపార అనుభవం, విజ్ఞానంతో ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని కొనియాడారు. కొవిడ్‌-19పై ఇటీవల నిర్వహించిన వెబినార్‌లో పీటర్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ ప్రపంచానికి ఒక బహుమతి అన్నారు. బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన సీరం సంస్థ తయారు చేస్తుండగా, దేశీయంగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ఐసీఎంఆర్‌తో కలిసి కొవాగ్జిన్‌ను తయారు చేసిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్‌ చేస్తున్న పోరాటం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.


Updated Date - 2021-03-08T13:15:41+05:30 IST