కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం.. మద్యం ప్రియులకు షాక్

ABN , First Publish Date - 2022-01-31T18:35:11+05:30 IST

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ వేసుకోలేదు.

కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం.. మద్యం ప్రియులకు షాక్

చెన్నై: కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాక్సినేషన్ వేసుకోలేదు. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధలను అమలు చేస్తున్నాయి. ఈ పరిస్థితి మందుబాబులకు చుక్కలు చూపిస్తోంది. వ్యాక్సిన్ వేసుకుంటేనే మద్యం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిబంధన పెట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై అవగాహనను కూడా కల్పిస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారికి బహుమతులు కూడా ఇస్తున్నారు. వాయిలాడ్ తురయ్ జిల్లా అధికార యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మద్యం ప్రియులకు షాకిచ్చారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం షాపుల్లో  కొనుగోలుదారులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టారు. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని, కోవిడ్ రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో మందుబాబులకు కొత్త చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఏం చేయాలో తెలియక వ్యాక్సినేషన్‌ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. కొందరు మొదటి డోస్ తీసుకుంటే.. మరికొందరు సెకండ్ డోస్ తీసుకుంటున్నారు.  

Updated Date - 2022-01-31T18:35:11+05:30 IST