హ‌నీమూన్‌కు సిద్ధ‌మై...ఐసోలేష‌న్‌కు వెళ్లిన కొత్త జంట‌!

May 9 2021 @ 09:50AM

గోరఖ్‌పూర్: ఆనందంగా హ‌నీమూన్‌కు వెళ్లాల‌నుకున్న‌ ఆ కొత్త జంట ఊహించ‌ని విధంగా హోమ్ ఐసోలేష‌న్‌కు వెళ్లాల్సివ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గ‌ల‌ రాప్తినగర్‌లో ఉంటున్న‌ సీనియర్ రైల్వే అధికారి కుమారునికి మే రెండున‌ ఘ‌నంగా వివాహం జ‌రిగింది. వ‌ధువును ఆనందంగా ఇంటికి స్వాగ‌తించారు. అయితే ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల్లోనే వ‌ధూవ‌రులిద్ద‌రూ క‌రోనా బారిన ప‌డ్డార‌ని తేలింది. ఈ జంట హనీమూన్‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఈ వార్త తెలిసింది. 

దీంతో వారు హోంఐసోలేష‌న్‌కు వెళ్లాల్సి వ‌చ్చింది.  ఇలాంటి ఉదంతాలు ఈ ఒక్క కుటుంబంలోనే కాదు చాలా కుటుంబాల్లో చోటుచేసుకుంటున్నాయి. గీడా ప్రాంతానికి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో మే 2న పెళ్లి వేడుక జ‌రిగింది. వివాహానికి హాజరైన అమెరికాకు చెందిన వారి బంధువుతో పాటు ప‌లువురు క‌రోనా బారిన ప‌డ్డారు. అమెరికాకు చెందిన ఆ వ్యక్తి ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్నాడు. అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా  బిచియా క్యాంప్ లోని ఒక ఫ్యామిలీలో ఏప్రిల్ మూడవ వారంలో వివాహం జరిగింది. ఇది జ‌రిగిన కొద్ది రోజుల‌కే ఆ కుటుంబానికి చెందిన  ముగ్గురు క‌రోనాకు బ‌ల‌య్యారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...