దేశంలో 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

ABN , First Publish Date - 2022-04-27T02:19:15+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

న్యూఢిల్లీ: దేశంలో 86% మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 86% మంది పెద్దలకు రెండు వ్యాక్సిన్ల డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 




అలాగే 6 నుంచి 12 ఏళ్ల వారికి కోవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్ రెండో డోస్‌‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. కోవిడ్‌పై మరింత దృఢంగా పోరు సాగించగలుగుతున్నామన్నారు. 




కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటివరకు 187 కోట్ల 95 లక్షల టీకాలు వేశారు. మరోవైపు గత 24 గంటల్లో కొత్తగా 2 వేల 483 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కేంద్రం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 192 కోట్ల 85 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 19 కోట్ల 90 లక్షల డోసులు నిల్వ ఉన్నాయి.  

Updated Date - 2022-04-27T02:19:15+05:30 IST