కోవిషీల్డ్ బూస్టర్ ధర ఎంతో చెప్పిన అదర్ పూనావాలా..

ABN , First Publish Date - 2022-04-09T00:27:15+05:30 IST

పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారిని ఈనెల 10 నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతిస్తున్నట్టు..

కోవిషీల్డ్ బూస్టర్ ధర ఎంతో చెప్పిన అదర్ పూనావాలా..

న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారిని ఈనెల 10 నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం శుక్రవారంనాడు ప్రకటించడంతో బూస్టర్ డోస్ వెల ఎంతో సెరెం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. కోవిషీల్డ్ బూస్టర్ ధర పన్నులతో కలుపుకొని రూ.600 అని, కొవోవాక్స్‌ను బూస్టర్‌గా అనుమతిస్తే దాని ధర పన్నులతో కలిసి రూ .900 ఉంటుందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సకాలంలో తీసుకున్న నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.


చాలా దేశాలు బూస్టర్ డోస్ తీసుకోని వారిపై ఆంక్షలు విధిస్తున్నందున విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్న అనేక మంది వెళ్లలేకపోతున్నారని, ఈ దశలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. బూస్టర్ డోస్‌లకు ఆర్డరిచ్చే ఆసుపత్రులు, డిస్ట్రిబ్యూటర్లకు సెరుం ఇన్‌స్టిట్యూట్ పెద్దమొత్తంలో డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుందని ఆయన చెప్పారు. కాగా, దీనికి ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన చేస్తూ, 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోస్ ఈనెల 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్ల వయస్సు పైబడిన వారే ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని పేర్కొంది.

Updated Date - 2022-04-09T00:27:15+05:30 IST