ప్రొద్దుటూరులో నడిరోడ్డుపై వింత ఘటన

Sep 25 2021 @ 21:24PM

కడప: ప్రొద్దుటూరు శ్రీనివాస్ నగర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. దారిన పోతున్న ఆవు వద్దకు వెళ్లి పంది పాలు తాగింది. రోడ్డు ప్రక్కన ఆవులు సంచరిస్తుండగా  పాల కోసం వచ్చిన పందిని చూసి ఆవు ఆగింది. సాధారణంగా ఇతర జంతువుల వద్దకు ఆవులు పెద్దగా చేరవు. అయితే ఆకలి ఎవరిదైనా ఒకటే అనుకుందేమో గోమాత.. పందికి పాలు ఇచ్చి మాతృత్వాన్ని చాటుకుంది. పాలను తాగేందుకు వచ్చిన వరాహాన్ని చూసి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన పాల పొదుగును పట్టింది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. జాతి వైర్యం మరిచి జంతువులు చూపించే ప్రేమపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.