పిరికి పులి!

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

ఒక ఊరిలో ఓ పులి ఉండేది. ఆ పులి మంచిది. క్షమాగుణం ఎక్కువ.

పిరికి పులి!

క ఊరిలో ఓ పులి ఉండేది. ఆ పులి మంచిది. క్షమాగుణం ఎక్కువ. అడవిలో వెళ్తోంటే ఏ సింహమో, ఏ చిరుతనో, ఏనుగో ఎదురవుతుందోనని భయపడేది. అందుకు తగినట్లు జాగ్రత్తగా నడిచేది. ఒక రోజు పులి కొలను దగ్గరికి వెళ్లింది. నీళ్లు తాగివస్తోంటే.. ఎదురుగా ఓ మదమెక్కిన ఏనుగు వచ్చి కిందపడింది. పులి దడుచుకుని పక్కకు పరిగెత్తింది. ఏనుగు బతికి ఉందో లేదోనని భయంతో దగ్గరకి వచ్చి చూసింది. ఏనుగు చచ్చిపోయింది. అసలు ఆ ఏనుగు ఎలా చచ్చిపోయిందో ఆ పులికే తెలీదు. అయితే ఏనుగు దగ్గర ఉన్న పులిని చూసి కుందేళ్లు, జింకలు, ఎలుగుబంట్లు భయపడ్డాయి. అంతటి మద గజాన్ని, నిత్యం మారణహోమం సృష్టించడానికి ఉండే ఏనుగును చంపటం అంటే మామూలు మాటలుకాదు అనుకున్నాయి. పులి ధైర్యం గురించి అడవికంతా తెలిసింది. పులి బిక్కుబిక్కుమంటూ ఇంటికొచ్చింది. అంతలోనే అందరూ పూలమాలు, బొకేలతో రెడీగా ఉన్నారు. బొకేలు ఇచ్చారు. పూలమాలలు మెడలో వేశారు. ‘నేనేం చేశాను. ఇవన్నీ ఎందుకూ’ అన్నది పులి. అందరూ భక్తితో, భయంతో పులిరాజా దగ్గర వినయంగా ఉన్నారు. విధేయతను ప్రకటించుకున్నారు.


అప్పటినుంచి పులికి గౌరవ మర్యాదలు దక్కటం ప్రారంభమైంది. ఇతర అడవుల్లోని జంతువులూ పులి గొప్ప దనాన్ని మెచ్చుకున్నారు. అయితే ఏనుగుల గుంపు తన మీద అసూయ పెంచుకుంటుందేమోనని తన దగ్గర అంగరక్షకులుగా నక్కలు, తోడేళ్లు, హైనాలను పెట్టుకుంది. ఏనుగుల గుంపు తన మీద దాడి చేయకూడదని దేవుడిని ప్రార్థించేది. తాను మంచివాడినని అడవికి చెప్పాలనుకునేది. కాకపోతే అధికారం పోతుందేమనని ఆ పిరికి పులి భయపడుతూనే జీవించేది. చివరికి ఇదేదో బావుందని ఆ పులి గంభీరంగా ఉండేది.

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST