ఆవులపై యాసిడ్‌ దాడి అంటూ గందరగోళం

ABN , First Publish Date - 2021-04-22T06:07:45+05:30 IST

రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో సంచ రిస్తున్న ఆవులపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడులు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఆవులపై యాసిడ్‌ దాడి అంటూ గందరగోళం

రాజమహేంద్రవరంసిటీ, ఏప్రిల్‌ 21: రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో సంచ రిస్తున్న ఆవులపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడులు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మునిసిపల్‌ స్కూల్‌ వెనుక ప్రాంతంలో ఉన్న ఆవులపై గాయాలు ఉన్నాయి. వాటిని గమనించిన స్థానికులు వాటిని పరిశీలించగా అవి కాలివుండ టంతో ఇది ఖచ్చితంగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే యాసిడ్‌పోసి దాడి చేశారని ఈ విషయాన్ని స్థానికులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. నారాయణపురం ప్రాంతంలో ఆవులు ఎక్కువగా రోడ్లపై సంచరిస్తూంటాయి. ఈ నేపథ్యంలో ఎవరో కాలవాలనే ఈ దాడిచేసి అల్ల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారా? లేదా మరేదైనా జరిగి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్‌నగర్‌ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్నదేవుల గంగరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆ ఆవులపై దాడే జరగలేదని అదొక వ్యాధిఅని ఆ ఆవులకు గత వారం రోజులు వైద్యులు చిక్సిత చేస్తున్నారని పోలీసుల విచారణలో బహిర్గతమైంది. వాటికి వైద్యసేవలు అందించిన వైద్యులు కూడా అది వ్యాధేనని ధ్రువీకరించారు. 


Updated Date - 2021-04-22T06:07:45+05:30 IST