విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం..

ABN , First Publish Date - 2020-11-28T07:15:15+05:30 IST

ఎన్నికల ప్రచారం

విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం..

ఎన్నికల ప్రసంగాలు రికార్డు చేస్తున్నాం, నిఘా పెడుతున్నాం

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నజర్‌ : రాచకొండ సీపీ

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌ హెచ్చరించారు. ఎన్నికల నియమావళి మేరకు ప్రచారం చేసుకోవచ్చునని, అయితే కొందరు నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అఽభ్యర్థులు, నేతల ప్రసంగాలు రికార్డు చేస్తున్నామని, సోషల్‌మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టులనూ గుర్తిస్తున్నామని సీపీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న 440 పోస్టులను తొలగించేందుకు ఆయా సంస్థలను కోరామని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్దేందుకు ప్రయత్నిస్తే 100కు గానీ 94906 17111 నెంబర్‌పై ఫిర్యాదు చేయాలన్నారు. రాచకొండ కమిషరేట్‌ పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం ఏడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, ఆరు స్టాటిక్‌ సర్వైలైన్‌ టీమ్‌లను ఏర్పాటు  చేసినట్లు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లను బైండోవర్‌ చేశామని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 6వేల మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-11-28T07:15:15+05:30 IST