డ్రగ్స్‌కు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలిస్తాం: CV Anand

ABN , First Publish Date - 2022-05-06T20:56:40+05:30 IST

హైదరాబాద్: నగరంలోని నాలుగు ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్స్‌తో పోలీసులు MOU కుదుర్చుకున్నారు.

డ్రగ్స్‌కు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలిస్తాం: CV Anand

హైదరాబాద్: నగరంలోని నాలుగు ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్స్‌తో పోలీసులు MOU కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్‌కు బానిసైన వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు తరలిస్తామన్నారు. జనవరి నుంచి 377 మంది డ్రగ్స్ సేవించే వారిని, రవాణా చేసే వారిని అరెస్టు చేశామన్నారు. అందులో 93 మంది డ్రగ్స్ పెడలర్లున్నారన్నారు. డ్రగ్స్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టామన్నారు. వారు బయటకి వచ్చిన తరువాత మంచి పౌరులుగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే వారిని రిహాబిలిటేషన్ సెంటర్స్‌కు వెళ్లాలని సూచిస్తున్నామని సీవీ ఆనంద్ అన్నారు.

Read more