సైబరాబాద్‌లో పటిష్ఠ బందోబస్తు : స్టీఫెన్‌

Sep 18 2021 @ 11:43AM

హైదరాబాద్‌ సిటీ: గణేష్‌ నిమజ్జనోత్సవాలను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 10 వేల మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. నిమజ్జనం ప్రాం తాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఐటీ సెల్‌ మానిటరింగ్‌ చేస్తారని వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 8,500 విగ్రహాలు  నిమజ్జనానికి ఉన్నట్లు తెలిపారు.  మహిళలు, చిన్నారుల భద్రత కు, వారి రక్షణకు షీటీమ్స్‌ను సివిల్‌ డ్రస్‌లో రంగంలోకి దింపుతున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి  భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విగ్రహాల నిమజ్జనానికి సైబరా బాద్‌లో 36 చెరువులను ఎంపిక చేశారు. 

చెరువుల వద్ద క్రేన్‌లు ఏర్పాటు చేశారు. లైట్లు, రోడ్డు మరమ్మతు పనులు, శాని టైజేషన్‌, మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా డయల్‌-100కు ఫోన్‌ చేయాలని సీపీ వెల్లడిం చారు. కాల్స్‌పై సిబ్బంది తక్షణమే స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం వేడుకలు ముగిసేంత వరకు లా అండర్‌ ఆర్డర్‌ సిబ్బందితో పాటు, ట్రాఫిక్‌ పోలీసులు ఏసీపీలు, డీసీపీలు ఎప్ప టికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని సీపీ పేర్కొన్నారు. 

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...