పోలీసులు ధైర్యంగా ఉండండి

ABN , First Publish Date - 2021-05-07T04:33:27+05:30 IST

ఆత్మస్థైర్యంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలని, సిబ్బంది ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌.వారియర్‌ కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్న సిబ్బందికి ధైర్యం చెప్పారు.

పోలీసులు ధైర్యంగా ఉండండి
వీడియోకాల్‌ ద్వారా సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ

ఐసోలేషన్‌లో ఉన్న సిబ్బందితో వీడియో కాల్‌లో మాట్లాడిన సీపీ

ఖమ్మంక్రైం,మే6: ఆత్మస్థైర్యంతో కరోనా వైరస్‌ను ఎదుర్కోవాలని, సిబ్బంది ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీస్‌ కమిషనర్‌ విష్ణు యస్‌.వారియర్‌ కరోనా బారిన పడి ఐసోలేషన్‌లో ఉన్న సిబ్బందికి ధైర్యం చెప్పారు. గురువారం సీపీ వీడియోకాల్‌ ద్వారా సిబ్బంది తో మాట్లాడారు. విశ్రాంతి తీసుకుంటూ తగిన ఆహార నియ మాలు పాటిస్తే, కరోనా నుంచి త్వరగా కోలుకో వాల న్నారు. పాజిటివ్‌ వచ్చిన సిబ్బందికి మందులు, డ్రైఫ్రూట్స్‌, సరఫరా చేస్తూ సిబ్బంది ఆరోగ్య పరిస్థితి పై మానిటరింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయి కమిటిని ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ఈ కమిటీ ఆరోగ్య పరిస్థితి పై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీడియో కాల్‌ ద్వారా వైద్యుల సలహాలు అందజేస్తారని చెప్పారు.మిగ తా సిబ్బంది కరోనా బారిన పడకుండా దిశా నిర్ధేశం చేస్తారన్నారు. కమిటీ అధికారులు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఐసీయూ బెడ్స్‌, అంబులెన్స్‌, ఆక్సిజన్‌ అందు బాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సుచించారు.

Updated Date - 2021-05-07T04:33:27+05:30 IST