కమ్యూనిస్టుల త్యాగాలతోనే చలసాని నగర్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2021-11-27T05:55:55+05:30 IST

సీపీఐ నాయకుల త్యాగాల ఫలితంగానే నాడు రాణిగారి తోటగా పిలువబడే ప్రాంతంలో చలసాని నగర్‌ నిర్మాణం జరిగిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పునరుద్ఘాటించారు.

కమ్యూనిస్టుల త్యాగాలతోనే చలసాని నగర్‌ నిర్మాణం
మాట్లాడుతున్న దోనేపూడి శంకర్‌

కమ్యూనిస్టుల త్యాగాలతోనే చలసాని నగర్‌ నిర్మాణం

 దోనేపూడి శంకర్‌

పాయకాపురం, నవంబరు 26 : సీపీఐ నాయకుల త్యాగాల ఫలితంగానే నాడు రాణిగారి తోటగా పిలువబడే ప్రాంతంలో చలసాని నగర్‌ నిర్మాణం జరిగిందని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పునరుద్ఘాటించారు. సీపీఐ 18వ డివిజన్‌ శాఖ 20వ మహాసభ పార్టీ సీనియర్‌ నాయకుడు గోగినేని వెంకయ్య అధ్యక్షతన శుక్రవారం చలసాని నగర్‌లోని కృష్ణారెడ్డి భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ  చలసాని నగర్‌లో  కూడా పార్టీ పునర్నిర్మాణానికి నాయకులు, కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలు విశేషంగా పాటుపడ్డారని  చెప్పారు. ఆ ఫలితంగానే చలసాని నగర్‌లోని ఇళ్లకు పట్టాలు,  రిజిస్ట్రేషన్లు జరిగాయని స్పష్టం చేశారు. నేడు వివిధ పార్టీలు ఈ ప్రాంతంలో  పాగా వేసినప్పటికీ చలసాని నగర్‌ కమ్యూనిస్టులకు కంచుకోటే అని, తిరిగి చలసానినగర్‌ను  కైవసం చేసుకుంటారని ఽధీమా వ్యక్తం చేశారు. వదర బాధితుల సహాయార్ధం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో శనివారం వన్‌టౌన్‌లోని కృష్ణవేణి క్లాత్‌ మార్కెట్‌ ప్రాంతంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హాజరవుతారని  తెలిపారు.

Updated Date - 2021-11-27T05:55:55+05:30 IST