వ్యవసాయ బిల్లులను సవరించాలి: సీపీఐ

ABN , First Publish Date - 2020-12-04T04:34:36+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు.

వ్యవసాయ బిల్లులను సవరించాలి: సీపీఐ
రైల్వేకోడూరులో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నేతలు

రైల్వేకోడూరు, డిసెంబరు, 3: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే సవరించి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. గురువారం రైల్వేకోడూరు సీపీఐ కార్యాలయం ఆవరణంలో ఆయన రైతు సంఘం జిల్లా నేత మలిశెట్టి రాహుల్‌తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ నిజంగా రైతుల మంచి కోస మే అయితే ప్రభుత్వం వెంటనే బిల్లులలో పా టు ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే రైతులు నమ్మేవారని తెలిపారు. కాంట్రాక్టు ఫార్మింగ్‌ చేసే కంపెనీ ఎంఎస్‌ స్వామినాధన్‌ చెప్పినట్లు రైతు పెట్టుబడికి 50 శాతం అదనంగా సొమ్ము ను కలిపి మద్దతు ధరగా చెల్లించాలని తెలిపారు. రైతు ఉత్పత్తుల కొన్న కంపెనీ ఫారిస్‌కి ఎక్స్పోర్ట్‌ చేయడానికి వీలు కల్పించ కూడదని తెలిపారు. భారతదేశంలో ఖచ్చితంగా 70 శాతం సేల్‌ చేయాలని నిబంధన తేవాలని డిమాండు చేశారు. కాంట్రాక్టు ఫార్మింగ్‌ కేవలం సేంద్రియ ఎరువులు లేదా జీరో బడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ ద్వారానే చేయాలన్నారు. రసాయనాలు వాడడం బ్యాన్‌ చేయాలని డిమాండు చేశారు. లేదంటే కార్పోరేటర్లు పీల్చి పీల్చేసిన భూమి రైతులకు దేనికి పనికిరాదన్నారు. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్‌ చేసుకోవాలన్నారు. యార్డులపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి గ్రామం లో శీతల గిడ్డంగులు, గోదాములు ఏర్పాటు చేయాలని డిమాండు చేశారు. రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కోడూరు సీపీఐ ఏరియా కార్యదర్శి తుమ్మల రాధాక్రిష్ణ, జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు చౌడవరం శంకరయ్య, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సిగె చెన్నయ్య, స్థానిక నాయకులు జ్యోతి చిన్నయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చెన్నూరు క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:34:36+05:30 IST