Cpi Cpm: మునుగోడులో బిలియంట్ గేమ్ ప్లే.. కానీ ఫ్యూచరేంటి?

ABN , First Publish Date - 2022-08-25T00:42:35+05:30 IST

ఉపఎన్నికలో త్రిముఖ పోరు జరగనుండడంతో లెఫ్ట్ పార్టీలే (Left Partys) విన్ మేకర్ పాత్ర పోషించనున్నాయి. దీంతో..

Cpi Cpm: మునుగోడులో బిలియంట్ గేమ్ ప్లే.. కానీ ఫ్యూచరేంటి?

మునుగోడు (Munugode): ఉపఎన్నికలో త్రిముఖ పోరు జరగనుండడంతో లెఫ్ట్ పార్టీలే (Left Parties) విన్ మేకర్ పాత్ర పోషించనున్నాయి. దీంతో ఎర్రన్నల స్నేహం కోసం కాంగ్రెస్ (Congress), టీఆర్ఎస్ (Trs) పార్టీలు తహతహలాడాయి. కలుద్దామని కాంగ్రెస్ నేతలు కాల్ చేసినా.. సీపీఐ (Cpi) నేతలు కట్ చేసి.. హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భేటీ అవుదామంటూ ఆశ చూపి ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో ఫ్రెండ్‌షిప్ డీల్ కుదుర్చుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. 



మునుగోడులో సీపీఐకి చాలా పెద్ద చరిత్రే ఉంది. మునుగోడు సీపీఐకి ఒకప్పుడు కంచుకోట. మునుగోడులో 12 సార్లు ఎన్నికలు జరగ్గా ఐదు సార్లు సీపీఐ గెలిచింది.అయితే ఈ సారి మాత్రం బీజేపీని ఓడించే బలమైన పార్టీ టీఆర్ఎస్‌ అని .. అందుకే ఆ పార్టీతో జతకట్టామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ (Chada Venkatreddy)  చెప్పారు. 


ఇదిలావుంటే మునుగోడులో సీపీఎం కూడా అధికార పార్టీకే మద్దతిస్తుందని ప్రచారం జరుగుతోంది. మునుగోడు సభలో కేసీఆర్ మాట్లాడుతూ సీపీఐ మద్దతు ఇచ్చిందని.. రేపో మాపో సీపీఎం కూడా దారిలోకి వస్తుందని క్లియర్‌గా చెప్పారు. సీపీఎంకి మునుగోడులో ఐదువేల ఓటు బ్యాంకు ఉంది. వీళ్ళు కూడా పార్టీ నిర్ణయం మేరకే నడుచుకునే ఛాన్స్ ఉంది. 



ఇక మునుగోడు ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. సీపీఐ, సీపీఎం (Cpi) పార్టీలు కలిసి పోటీ చేస్తే గట్టి పోటీనే ఇచ్చేవి. కానీ ఇది ప్రత్యేక ఉప ఎన్నిక కాబట్టి.. మూడు ప్రధాన పార్టీల ధన ప్రవాహం తట్టుకోవడం లెఫ్ట్ పార్టీలతో సాధ్యం కాదు. ఒకవేళ పోటీ చేసినాలుగో స్థానానికి పరిమితమైతే మోరల్‎గా మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి మద్దతిచ్చి గెలుపులో భాగమై అధికార పార్టీకి ఫ్రెండ్లీ పార్టీగా చెలామణిలో ఉండేలా బ్రిలియంట్ గేమ్ ప్లే చేసిందని చెప్పొచ్చు.


కాగా కంచుకోట మునుగోడులో పోటీ చేయలేక ఎర్ర గులాబీలుగా మారిన కమ్యూనిస్టులు.. భవిష్యత్‌లో వారు చేయబోయే రాజకీయం మీదనే ఉనికి ఆధారపడి ఉంది. కేసీఆర్ దృష్టిలో పడి ఆయన సానుభూతి పొందితే తప్ప.. ఉన్న కొద్దో గొప్పో ఉనికిని కోల్పోకుండా కాపాడుకోగలమన్న అంచనాకు కమ్యూనిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. అధికార పార్టీ.. పోరాట పార్టీల దోస్తీ రాబోయే రోజుల్లో ఎలా కొనసాగనుందో చూడాలి మరి...



Updated Date - 2022-08-25T00:42:35+05:30 IST