తాగు, సాగు నీరు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-04T05:10:38+05:30 IST

హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి రైతుల పంట పొలాలకు ఉపకాలువలు తవ్వించి నీరు అందించాలని, అలాగే ప్రజలకు తాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ డిమాండు చేశారు.

తాగు, సాగు నీరు ఇవ్వాలి
మల్యాలలో హంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకులు

  1. హంద్రీ నీవా, పోతిరెడ్డిపాడును సందర్శించిన సీపీఐ నాయకులు


నందికొట్కూరు రూరల్‌, డిసెంబరు 3: హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి రైతుల పంట పొలాలకు ఉపకాలువలు తవ్వించి నీరు అందించాలని, అలాగే ప్రజలకు తాగునీరు అందించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ డిమాండు చేశారు. గురువా రం మండలంలోని హంద్రీ నీవా ప్రాజెక్టును సీపీఐ రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. వారు మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులో భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయలేదన్నారు. సీపీఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి, ఏఐఎస్‌ ఎప్‌ తాలుకా నాయకులు సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


జూపాడుబంగ్లా: శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణం సమయంలో 108 గ్రామాలు, లక్ష 20వేల ఎకరాలు ముంపునకు గురైన సంబంధిత గ్రామాల్లో 40ఏళ్లుదాటిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. గురువారం ఆయన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటికి జీవో 98 ప్రకారం నిరుద్యోగులు వేచిచూస్తుండటం శోచనీయమన్నారు. కనీసం గ్రామాల్లో తాగు, సాగునీటి సదుపాయాలు కల్పించలేదన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, మల్యాల ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించలేకపోతున్నారన్నారు. హంద్రీ నీవా కాలువకు ఉపకాలువలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని, లేకపోతే ఉప కాలువలను తీసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రఘురామమూర్తి, శ్రీనివాసులు, నరేష్‌, అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:10:38+05:30 IST