అక్రమ అరెస్టులను ఖండించండి

ABN , First Publish Date - 2022-07-01T06:40:47+05:30 IST

అక్రమ అరెస్టులను ఖండించండి

అక్రమ అరెస్టులను ఖండించండి
పెగడపెల్లి డబ్బాల వద్ద ధర్నా చేస్తున్న గుడిసెవాసులు

 సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి    

 పెగడపెల్లి డబ్బాల వద్ద ధర్నా 

హనుమకొండ క్రైం, జూన్‌ 30 : దాడికి గురైన గుడిసెవాసులను పరామర్శించేందుకు వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి, కేరళ ఎంపీ బినోయ్‌ విశ్వంతో పాటు సీపీఐ నాయకులను అరెస్టు చేయడాన్ని వామపక్షాలు, ప్రజలు, ప్రజాసంఘా లు, కవులు, కళాకారులు ఖండించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి పిలుపునిచ్చారు. గుండ్లసింగారం గుడిసెవాసులతో కలిసి గురువారం పెగడపెల్లి డబ్బాల వద్ద ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. గుండ్లసింగారంలో గుడిసెలు వేసుకోవడాన్ని కొందరు జీర్ణించుకోలేక గుండాలు, రౌడీషీటర్లతో దాడులు చేయిస్తున్నారన్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన జాతీయ, రాష్ట్ర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి మాట తప్పడంతోనే నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారని గుర్తుచేశారు. గుడిసెవాసులను ముట్టుకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నేదునూరి జ్యోతి, అంబేద్కర్‌, నాగరాజు, సాగరిక, మమత, మౌనిక, రజిత, విజయలక్ష్మి, నరేందర్‌, అమృత పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:40:47+05:30 IST