Telangana: రియల్ ఎస్టేట్ మాఫియాతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతులు కలిపింది: CPI పార్లమెంటరీ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం

ABN , First Publish Date - 2022-05-18T17:03:00+05:30 IST

టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపిందని CPI పార్లమెంటరీ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భూ ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోందన్నారు.

Telangana: రియల్ ఎస్టేట్ మాఫియాతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతులు కలిపింది: CPI పార్లమెంటరీ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం

Warangal: టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపిందని CPI పార్లమెంటరీ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం భూ ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట తప్పడంతో పేదలు రోడ్డెక్కారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. వరంగల్‌లో చెరువులు, కుంటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారని, వారి కోసం సీపీఐ అండగా నిలుస్తుందన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వరంగల్‌లో భూపోరాలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిసి తాను వచ్చానన్నారు. కాగా హనుమకొండ గుండ్ల సింగారం వెళ్తున్న బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీపీఐ నాయకులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తర్వాత బినోయ్ విశ్వం, CPI నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-05-18T17:03:00+05:30 IST