
మహబూబాబాద్: ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన 317 జీవోలోని లోపాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్‌లో రైతులను నిలువునా ముంచుతున్న దళారీ వ్యవస్థను అరికట్టాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో మిర్చిపంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి