విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-04-23T13:53:01+05:30 IST

కరోనా ఆపత్కాలంలో రోజుకి 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా?: రామకృష్ణ

అమరావతి: కరోనా ఆపత్కాలంలో రోజుకి 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు చర్యలు వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. మరో 50 టన్నుల సామర్థ్యం పెంచి, రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం అమ్మడాన్ని విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-04-23T13:53:01+05:30 IST