అనంతపురంలో సీపీఐ నేత రామకృష్ణ అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-05-09T16:52:17+05:30 IST

జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు.

అనంతపురంలో సీపీఐ నేత రామకృష్ణ అర్ధనగ్న ప్రదర్శన

అనంతపురం: జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. చలో సెక్రటేరియట్‌కు వెళ్తున్న సీపీఐ నేతలను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి ముప్పుతిప్పలు పెట్టి వదిలేసిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుకు నిరసనగా సీపీఐ నేతలు గత రాత్రి అంబేద్కర్ విగ్రహం ముందుకు పడుకుని నిరసన తెలియజేశారు. 

Read more