కేంద్రంతో కుమ్మక్కైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: Ramakrishna

ABN , First Publish Date - 2022-04-18T18:05:21+05:30 IST

పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

కేంద్రంతో కుమ్మక్కైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: Ramakrishna

అమరావతి: పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై ఎత్తు తగ్గిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. ఏపీ సర్కార్ మూడేళ్ళలో ఒక కాలువ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని..ఒక ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. త్వరలో పోలవరం ప్రాజెక్టు పనులను సీపీఐ తరుపున పరిశీలిస్తామని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుకు అసలు ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు. నెల్లూరు కోర్టులో కాకాణి ఫైల్ మాత్రమే దొంగలు ఎలా దొంగతనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఫైల్స్ ఉండే కోర్టులో ఒక కాకాణి ఫైల్ మాత్రమే దొంగలకు దొరికిందా అని నిలదీశారు. నెల్లూరు ఎస్పీ కాకి డ్రెస్ వేసుకున్నాడా లేదా అనే అనుమానం కలుగుతోందని ఆగ్రహించారు. స్కాప్ దొంగలకు కోర్టులో కాకాణి ఫైల్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు కాకి డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకుంటే మంచిదని యెద్దేవా చేశారు. నెల్లూరు కోర్టులో ఫైల్స్ మాయంపై హైకోర్టుకు లేఖ రాస్తామని రామకృష్ణ వెల్లడించారు. 

Updated Date - 2022-04-18T18:05:21+05:30 IST