కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-20T18:23:16+05:30 IST

కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి: Ramakrishna

అమరావతి: కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. గతంలో తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్పి, మృతదేహాన్ని అనంతబాబు కారులో తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం నిజంగా యాక్సిడెంట్‌లో చనిపోతే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఎలా తరలించారని నిలదీశారు. వైసీపీ నేతలకు చట్టాలు వర్తించవా అని అడిగారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-05-20T18:23:16+05:30 IST