ఎమ్మెల్యే కారును అడ్డగించిన సీపీఐ నాయకులు

ABN , First Publish Date - 2021-05-07T06:35:30+05:30 IST

ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గురువారం సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు

ఎమ్మెల్యే కారును అడ్డగించిన సీపీఐ నాయకులు

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం 

అందించాలని నిరసన

కదిరి, మే 6:  ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని గురువారం సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొవిడ్‌ బా ధితులను పరామర్శించడానికి ఆసుపత్రికి వస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సిద్దారెడ్డిని గేటు వద్దే అడ్డుకున్నారు. పోలీసులు చొరవ తీసుకొని అడ్డు తొలగిం చారు.  అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వేమయ్యయాదవ్‌  మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులను ఆదుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దనిద్ర వీడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ ఏర్పాటు చేసి రోగుల రద్దీ కొద్దీ ఆక్సిజనలు, బెడ్‌లు సంఖ్య యుద్ధ ప్రాతిపదికన పెంచాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన అందక మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన సమస్యను పరిష్కరించి, బాధితులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న కొందరు డాక్టర్‌లు సొంత నర్సింగ్‌హోంలలో పనిచేస్తూ, ఇక్కడ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కదిరప్ప, మనోహర, నరసింహులు, ఇమ్రాన, ముబారక్‌, లక్ష్మేనాయక్‌, లియా ఖత, ఈశ్వ రయ్య, రాజేంద్ర, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T06:35:30+05:30 IST