అమరావతి : రాష్ట్రానికి జరిగే ద్రోహంలో జగన్ ప్రభుత్వం పాత్ర కూడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రానికి వాటాలు లేవని, స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ఇప్పటికే జగన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని నిర్మలా సీతారామన్ చెప్పారని పేర్కొన్నారు.