
కర్నూలు: పెంచిన ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగా ఈనెల 21 నుంచి 24 తేదీ వరకు అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 25, 26 తేదీల్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులకు కరపత్రాల పంపిణీ చేస్తామని తెలిపారు. 30వ తేదీ అన్ని కలెక్టరేట్ల ముందు 10 వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలను తగ్గిస్తానని చెప్పిన జగన్.. 7 సార్లు పెంచాడని, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పోలీసులను వెంట బెట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి