ఆర్థిక పరిస్థితి, అప్పులపై Buggana అవాస్తవాలు కట్టిపెట్టాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-06-25T18:35:23+05:30 IST

రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Buggana Rajendranath Reddy)కు

ఆర్థిక పరిస్థితి, అప్పులపై Buggana అవాస్తవాలు కట్టిపెట్టాలి: Ramakrishna

Amaravathi : రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(Buggana Rajendranath Reddy)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) సూటి ప్రశ్న వేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవాస్తవాలు కట్టిపెట్టాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే దుల్హన్ పథకానికి రూ.లక్ష ఇవ్వలేమని హైకోర్టు(High Court)లో అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేశారని ప్రశ్నించారు. వైసీపీ అధికారం చేపట్టాక ఏపీలో కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పగలరా? అని రామకృష్ణ నిలదీశారు.

Updated Date - 2022-06-25T18:35:23+05:30 IST