
అమరావతి: ఏపీకి గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన జనసేన అధినేత పవన్‌కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడని ఆయన ఆరోపించారు. అమిత్ షా డైరెక్షన్లో ఆస్తులను అదానికి అప్పగిస్తున్నారన్నారు. మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్లో సీఎం జగన్ నడుస్తుంటే...ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపి నాయకుల డైరెక్షన్లో పనిచేస్తున్న జగన్‌ని దించి తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని పవన్ అడుగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని చెప్పిన పవన్ కి ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో చేవచచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. జగన్ అప్రజాస్వామిక పోకడలపై తాము పోరాడుతున్నామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి