విజయవాడ: సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నేడు

Dec 5 2021 @ 09:42AM

విజయవాడ: రాయలసీమ, నెల్లూరు జిల్లాల వరద బీభత్సాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఆదివారం విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ భేటీలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు పాల్గొంటారన్నారు. తుఫాను, వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.