ఒక వ్యాక్సిన్‌కు మూడు ధరలా?: చాడ

ABN , First Publish Date - 2021-04-23T09:31:20+05:30 IST

కేంద్రం ఒకవ్యాక్సిన్‌కు మూడు ధరలను నిర్ణయించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు.

ఒక వ్యాక్సిన్‌కు మూడు ధరలా?: చాడ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కేంద్రం ఒకవ్యాక్సిన్‌కు మూడు ధరలను నిర్ణయించడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యాదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసిన మోదీ ప్రభుత్వం.. దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. అలాగే, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2021-04-23T09:31:20+05:30 IST