ఇంటి పన్ను పెంపుపై సీపీఎం నిరసన

ABN , First Publish Date - 2020-12-03T05:37:49+05:30 IST

ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. అలాగే మంచినీరు, మురుగు నీరు, చెత్తపై యూజర్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

ఇంటి పన్ను పెంపుపై సీపీఎం నిరసన
నిరసన తెలుపుతున్న సీపీఎం ప్రతినిధులు

సిరిపురం : ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. అలాగే మంచినీరు, మురుగు నీరు, చెత్తపై యూజర్‌ చార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జీవో కాపీలను దగ్ధం చేశారు. అనంతరం సీపీఎం నగర కార్యదర్శి సభ్యుడు ఆర్‌.కెఎస్‌.వి.కుమార్‌ మాట్లాడుతూ తక్షణం ఈ జీవోలను రద్దుచేసి, ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులో యాభైశాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో పన్నుల పెంపు దుర్మార్గమన్నారు. ఈ ఆందోళనలో వార్వా నాయకులు ప్రకాశరావు, నివాస్‌, నారాయణమూర్తి, పద్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:37:49+05:30 IST