అధిక ధరలను నియంత్రించాలని సీపీఎం పాదయాత్ర

Published: Sun, 29 May 2022 00:40:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అధిక ధరలను నియంత్రించాలని సీపీఎం పాదయాత్ర

అధిక ధరలను నియంత్రించాలని సీపీఎం పాదయాత్ర

కృష్ణలంక, మే 28 :అధిక ధరలను నియంత్రించాలని, ఈ నెల 30న జరిగే కలెక్టరేట్‌ వద్ద ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం 21వ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంక కల్పనా ప్రింట్స్‌ రోడ్డు వద్ద నుంచి సబ్‌ వే వరకు సీపీఎం నాయకులు ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ మతం, కులం పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 30న అన్ని కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రజలంతా ఈ ధర్నాలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని కాశీనాథ్‌ కోరారు. సీపీఎం నాయకులు కోరాడ రమణ, లక్ష్మణ్‌కుమార్‌, తాడి రమణ, శివాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు. 

రాణిగారితోట: అధిక ధరలను నియంత్రించాలని కోరుతూ రాణిగారితోట 17వ డివిజన్‌ సీపీఎం కమిటీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వామపక్షాలు కదిలాయని, దేశ వ్యాప్తంగా ఈ నెల 30న అన్ని కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నారని, దీనిలో భాగంగా రాష్ట్రంలో నిర్వహించే ధర్నాల్లో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని కోరారు. నాయకులు ఎన్‌.హరినారాయణ, తమ్మిన చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.