ప్రదర్శనలో సీపీఐ, సీపీఎం నాయకులు
కోవూరు, డిసెంబరు 3 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు గురువారం బజారు కూడలి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకుడు గోనె దయాకరరావు మాట్లాడుతూ సంప్రదాయక వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకే మూడు చట్టాలను తీసుకువచ్చిందన్నారు. చట్టాల రద్దుకు అన్ని వర్గాల ప్రజలు సమైక్యంగా కదలాలన్నారు. ఆందోళనలో సీపీఎం డివిజన్ కమిటీ నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, తుళ్లూరు గోపాల్, సీపీఎం మండల కమిటీ కార్యదర్శి గండవరపు శేషయ్య, సీపీఐ నాయకులు విడవలూరు హనుమంతరావు, ఎజ్దానీ తదితరులు పాల్గొన్నారు.