జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలి

ABN , First Publish Date - 2022-06-29T05:57:46+05:30 IST

జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను కట్టించాలని, టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ డిమాండ్‌ చేశారు.

జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలి
సచివాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న సీపీఎం నాయకులు

జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించాలి

79వ సచివాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా 

రాణిగారితోట, జూన్‌ 28: జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను కట్టించాలని, టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌  డిమాండ్‌ చేశారు. రాణిగారితోట 18వ డివిజన్‌లోని 79వ సచివాలయం వద్ద మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు హరి నారాయణ, చంద్రశేఖర్‌, పాల్గొన్నారు.

కృష్ణలంక : జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో కృష్ణలంక నిర్మలా శిశుభవన్‌ ప్రాంతంలో కృష్ణానది కరకట్టపై సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో జగన్‌ 30 లక్షల ఇళ్లు పేదలకు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఇళ్లు కాదు కదా కనీసం స్థలం కూడా చూపించకుండా మోసం చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులు తాము అధికారంలోకి రాగానే రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్‌ బిల్లులు, ఐటీ రిటర్న్‌లు వంటి సాకులు చూపి సంక్షేమ పథకాలు రాకుండా అనర్హులను చేస్తున్నారన్నారు. రద్దయిన పెన్షన్‌లను వెంటనే పునరుద్ధరించాలని కాశీనాథ్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎం నాయకులు పుప్పాల కృష్ణ, కోరాడ రమణ, లక్ష్మీనారాయణ, దేవుడమ్మ, అప్పలనర్సయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:57:46+05:30 IST