రోడ్లను బాగుచేయండి

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

పట్టణంలో వర్షాల వల్ల పాడైన రోడ్లతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజలను రక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు.

రోడ్లను బాగుచేయండి
పైడిపర్రులో పాడైన రోడ్డు వద్ద సీపీఎం నాయకుల ధర్నా

పాడైన రోడ్ల వద్ద సీపీఎం ధర్నా

తక్షణ మరమ్మతులకు డిమాండ్‌

తణుకు, నవంబరు 27: పట్టణంలో వర్షాల వల్ల పాడైన రోడ్లతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్లకు మరమ్మతులు చేపట్టి ప్రజలను రక్షించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పైడిపర్రు గాంధీ సెంటర్‌లో ప్రమాదకరంగా ఉన్న రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా సమయంలో లారీ కూరుకుపోతే శ్రమదానం చేసి రాళ్ళు వేశామని తెలిపారు. నాయకులు గార రంగారావు, అజయకుమారి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడు: తాళ్ళ ముదునూరుపాడు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే రోడ్డు ప్రయాణికుల పట్ల మృత్యుకూపంలా మారిందని సీపీఎం మండల కన్వీనర్‌ చిర్లా పుల్లారెడ్డి, కమిటీ సభ్యుడు బంకూరు నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం గోతుల వద్ద నిలబడి నిరసన తెలిపారు. ఈ  రోడ్డుపై ప్రతి రోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారని,  ఇక్కడ వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. తక్షణం రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  పెనగంటి దుర్గారావు, కొవ్వూరి దానిరెడ్డి, వెలగల పల్లారెడ్డి, తాడి బాలయ్య , కర్రి అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST