రేపటి నుంచి అద్దంకిలో సీపీఎం జిల్లా మహాసభలు

Dec 3 2021 @ 00:51AM
ఆహ్వానపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
అద్దంకిటౌన్‌, డిసెంబరు 2: సీపీఎం ప్రకాశం జిల్లా (తూర్పు) 13వ మహా సభలు ఈ నెల 4, 5 వ తేదీలలో అద్దంకిలోని జరగనున్నాయని, ప్ర జలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు చీకటి శ్రీనివాసరావు, జీవీ కొండారెడ్డి కోరారు. గురువారం స్థానిక సుందరయ్య భవనం లో మహాసభల వివరాలకు సంబంధించి ఆ హ్వా న ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయిన వి విధ ప్రాజెక్టులు, పరిశ్రమలతో పాటు వ్యవసా యం రంగం వంటి పలు అంశాలపై జిల్లా పార్టీ నాయకులు వివరిస్తారన్నారు.  4 వతేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక శింగరకొండ రోడ్డులోని కూకట్ల కన్వెన్షన్‌లో మహాసభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సీపీఎం నాయకులు, కార్మికులు, రైతులు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నా యకులు కంకణాల ఆంజనేయులు, సీహెచ్‌.గంగ య్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.