జగన్ గారూ.. ప్రజల ఆకాంక్షలు గౌరవించండి: CH baburao

Published: Fri, 25 Mar 2022 13:02:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon

అమరావతి: రాజధానిపై సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మండిపడ్డారు. ‘‘జగన్ గారూ.. ప్రజల ఆకాంక్షలు గౌరవించండి. రాజధాని అమరావతి వివాదానికి స్వస్తి పలకండి. రాజధాని అమరావతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పోటీ పెట్టకండి. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచకండి. అమరావతిపై మాటల్లో ప్రేమ కాదు, చేతల్లో చూపండి. వికేంద్రీకరణపై వక్రభాష్యాలు వద్దు. గత ప్రభుత్వం తప్పులు చేస్తే సరిదిద్దండి, ప్రజలపై కక్ష సాధించకండి. రాజధాని అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులకై కేంద్రంపై ఒత్తిడి తెండి. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇతర వ్యవస్థలపై నెపం నెట్టకండి’’ అంటూ బాబూరావు అన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.