హక్కుల కోసం పోరాటం చేద్దాం: రాఘవులు

ABN , First Publish Date - 2022-01-13T20:37:07+05:30 IST

హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పోరాటం చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో

హక్కుల కోసం పోరాటం చేద్దాం: రాఘవులు

హైదరాబాద్: హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పోరాటం చేయాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హక్కుల కోసం కలసి పోరాడుదామని సీఎం కేసీఆర్‌ను కేరళ సీఎం పినరయి విజయన్ కోరారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసి రాజ్యాంగ హక్కులను  బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. యూపీలో బీజేపీకి మౌర్య రాజీనామా చేసినందుకు ఆరేళ్ళ క్రితం కేసును తిరగదోడి వేధిస్తున్నారన్నారు. వేధింపులను అరికట్టేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. 


బీజేపీ హయాంలో పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు భారీగా  పెరిగాయి కానీ‌.‌. గిట్టుబాటు ధరలు పెరగలేదన్నారు. ధరలను అదుపులో ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోరాటాలకు సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. కార్మిక కోడ్, ధరల పెరుగుదల, ప్రభత్వ సెక్టార్ల అమ్మకంపై ఫిబ్రవరిలో సీపీఎం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేచనుందని ఆయన పేర్కొన్నారు. సమాఖ్య వ్యవస్థ కోసం సీపీఎం ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన తెలిపారు. 




Updated Date - 2022-01-13T20:37:07+05:30 IST