CPM Madhu: తారాస్థాయికి కొడాలి నాని బూతుల పంచాంగం

ABN , First Publish Date - 2022-09-21T17:26:18+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బూతుల పంచాంగం తారాస్థాయికి చేరుతోందని సీపీఎం నేత మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPM Madhu: తారాస్థాయికి కొడాలి నాని బూతుల పంచాంగం

ప.గో: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali nani) బూతుల పంచాంగం తారాస్థాయికి చేరుతోందని సీపీఎం నేత మధు (Madhu) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం భీమవరంలో సీపీఎం దేశ రక్షణ భేరి జిల్లా యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కొడాలి నాని (YCP Leader) బూతు ప్రచారం కొనసాగించినంతకాలం రాజకీయాల్ని గుండాయిజం వైపు నడవడం తప్ప మరొకటి కాదన్నారు. కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతోందని తెలిపారు. బూతు ప్రచారం రాజకీయాల్లో కొనసాగించడం వల్ల కలుషిత వాతావరణం ఏర్పడి చివరికి వైలెన్స్‌నకు దారి తీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ ప్రభుత్వం (AP Government) అమరావతి రాజధాని (Amaravati Capital) పేరుతో కొత్తకొత్త తగాదాలు తెచ్చుకుంటోందన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ (NTR university)కి వైయస్సార్ (YSR) పేరు తగిలించి అనవసరమైన వివాదాల్లో కూరుకుపోవడం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)కి ప్రభుత్వానికి ఎవరూ సాటిలేరని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని సాఫీగా కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని... అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా లేదని మధు (CPM  Leader) అన్నారు. 

Updated Date - 2022-09-21T17:26:18+05:30 IST