CH baburao: జర్నలిస్టు అంకబాబు అక్రమ నిర్బంధం గర్హనీయం

ABN , First Publish Date - 2022-09-23T18:24:56+05:30 IST

సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబును అక్రమంగా నిర్బంధించడం గర్హనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు అన్నారు.

CH baburao: జర్నలిస్టు అంకబాబు అక్రమ నిర్బంధం గర్హనీయం

అమరావతి: సీనియర్ జర్నలిస్టు కొల్లు అంకబాబు (Ankababu)ను అక్రమంగా నిర్బంధించడం గర్హనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు (CH Babu rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబట్టడంపై వచ్చిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపారనే నెపంతో అంకబాబు(Senior Journalist)ను సీఐడీ (CID) పోలీసులు నిర్బంధించడం శోచనీయమన్నారు. ప్రముఖ జర్నలిస్టుగా, నగర ప్రముఖుడుగా గుర్తింపు పొందిన 72 సంవత్సరాల వయస్సు ఉన్న అంకబాబుని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కుటుంబ సభ్యులకు కూడా తగినటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళలో నిర్బంధించడం గర్హనీయమన్నారు. ఇది పౌరుల స్వేచ్ఛని హరించే చర్య, జర్నలిస్టులు, ప్రజల గొంతు నులిమే చర్య అని మండిపడ్డారు. తక్షణమే అంకబాబు  విడుదల చేయాలని, అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని సీహెచ్ బాబూరావు (CPM State Secretariat members ) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-23T18:24:56+05:30 IST