ltrScrptTheme3

సీపీఎస్‌, యాప్‌లను తక్షణమే రద్దుచేయాలి

Oct 27 2021 @ 00:39AM

-ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ ముత్యాలప్ప

ధర్మవరం, అక్టోబరు 26: సీపీఎస్‌, యాప్‌ల రద్దుతోపాటు పీఆర్‌సీలను తక్షణ మే అమలు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ బీకేముత్యాలప్ప ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్జీఓహోం కార్యాలయంలో మంగళవారం ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనంకి అశోక్‌కుమార్‌, రాష్ట్ర ఆడిట్‌ కన్వీనర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్న  అపరిష్కృ తంగా ఉన్న ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించకపోగా నూతన సమస్యలు సృస్టిస్తోందన్నారు. అనంతరం చలో విజ యవాడ గోడపత్రికలను ఆవి ష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్‌ నాగేశ్వరి, ప్రత్యేక ఆహ్వానితులుబల రాముడు, నాయకులు సానేరవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, ధర్మవరం జోన్‌ పరిధిలోని వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకరనారాయణ, వాసుకుమార్‌, నాగభూషణ, జగదీశ్‌, వెంకటరాముడు, శ్రీనివాసులు, సూర్యప్రకాశ్‌, నాగేంద్ర, ఆంజ నేయులు, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.