రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని చూసైనా సీపీఎస్‌ రద్దు చేయండి

Published: Sun, 27 Mar 2022 01:25:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon

సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ నరసింహారావు

జగ్గయ్యపేట, మార్చి 26: రాజస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయాలని, కమిటీలపై కమిటీలు వేసి కాల యాపన చేయవద్దని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌, ఎస్టీయూ మండల అధ్యక్షుడు టీఎల్‌ నరసింహారావు కోరారు. శనివారం టీచర్స్‌ సొసైటీ భవనంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నరసింహారావు మాట్లాడారు. అధికారంలోకి రాగా సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ ఆ హామిని విస్మరించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధించటం తగదన్నారు. సోమవారం జిల్లా కేంద్రాలలో నిర్వహించే నిరసన ధర్నా, ప్రదర్శనల్లో సీపీఎస్‌ ఉద్యోగులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనంద్‌, బుజ్జిబాబు, ఎల్‌ఎండీ నాయక్‌, రాజేంద్ర పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.