ర్యాలీలో పాల్గొన్న సంఘ నాయకులు
ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 27 : సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్, డీఈవో కార్యాలయం, కలెక్టరేట్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అధికారం లోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగుల రిటైర్మెంట్ తరువాత జీవితానికి భరోసాలేని సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు శాసన సభలో ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ప్రసాదరాజు, సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యదర్శి దాసు, ప్రధాన కార్యదర్శి రెడ్డి రామారావు పాల్గొన్నారు.